Friday, November 22, 2024
HomeతెలంగాణKhammam: పోలీసుల ఆధ్వర్యంలో తెలంగాణ రన్

Khammam: పోలీసుల ఆధ్వర్యంలో తెలంగాణ రన్

రన్నింగ్ తో యువతలో శారీరక దృఢత్వం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ రన్ ను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్, నగర మేయర్ పునుకొల్లు నీరజలతో కలిసి సర్దార్ పటేల్ స్టేడియం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ రన్ సర్దార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు కొనసాగింది. రన్ అనంతరం కలెక్టర్, పోలీస్ కమీషనర్ లు అధికారులతో ట్యాoక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీలు దిగారు.

- Advertisement -

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని రన్నింగ్ దానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ రన్ పూర్తి చేసిన యువతకు మెడల్ ప్రదానం చేశారు. తెలంగాణ రన్ లో పెద్దఎత్తున యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్ సింగ్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ట్రెయిని ఐపీఎస్ అవినాష్ కుమార్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పరంధామ రెడ్డి, కార్పొరేటర్ కె. కృష్ణ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News