Friday, November 22, 2024
HomeతెలంగాణKhammam leaders met Nitin Gadkari: నితిన్ గడ్కరీను కలిసిన ఖమ్మం నేతల బృందం

Khammam leaders met Nitin Gadkari: నితిన్ గడ్కరీను కలిసిన ఖమ్మం నేతల బృందం

ఖమ్మం జాతీయ రహదారులపై తమ విజ్ఞప్తులను మంత్రికి విన్నవించిన బృందం

నితిన్ గడ్కరీను కలిసి తమ డిమాండ్లను వెల్లడించారు రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య. కల్లూరు మండలం లింగాల వద్ద (కల్లూరు-వూటుకూరు రహదారిపై) మరియు వేంసూరు మండలం, లింగపాలెం, వేంసూరు శివారు (సత్తుపల్లి-విజయవాడ రహదారిపై) ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు ఇవ్వాలని, సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పినపాక నుండి తల్లాడ టౌన్ వరకు, కల్లూరు టౌన్, పెనుబల్లి నుండి లంకపల్లి వరకు, కిష్టారం వై జంక్షన్ వద్ద నుండి సత్తుపల్లి టౌన్ లిమిట్స్ వరకు, సత్తుపల్లి పట్టణ శివారు నుండి గంగారం Y జంక్షన్ వరకు పోలీస్ శాఖ వారిచే 11 (బ్లాక్ స్పాట్లుగా) రోడ్డు ప్రమాద హెచ్చరికలుగా గుర్తించినందున సెంట్రింగ్ లైటింగ్ తో 4 లైన్ రోడ్ కు అనుమతులను, నిధులను మంజూరు చేయాలని క్రితంలో దరఖాస్తులను ఎంపీ నామ నాగేశ్వరావు , రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి , సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సిఫార్సుతో అందజేయగా సదరు ప్రతిపాదనపై రిపోర్టును తెలపాలని హైదరాబాదు నేషనల్ హైవేస్ రీజనల్ ఆఫీసుకు ఢిల్లీ జాతీయ రహదారుల శాఖ నుండి ఆదేశాలు రాగా అనుమతులు మంజూరుకు సానుకూలంగా తెలుపుతూ రిపోర్టును హైదరాబాద్ నేషనల్ హైవేస్ రీజినల్ ఆఫీస్ వారు ఢిల్లీ జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ కి పంపారని ప్రస్తుతం ఢిల్లీలో జాతీయ రహదారుల శాఖ వద్ద ఉన్న రిపోర్టును త్వరితగతిన పరిశీలన చేసి మంజూరుకు నిధులను అనుమతులను మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రివర్యులు నితిన్ గట్కరి ను రాజ్యసభ సభ్యులు, బండి పార్థసారథి రెడ్డి ,రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య కలసి వినతి పత్రాన్ని అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News