Friday, November 22, 2024
HomeతెలంగాణKhammam: ఘనంగా దశాబ్ది ఉత్సవాలు

Khammam: ఘనంగా దశాబ్ది ఉత్సవాలు

దశాబ్ది రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి ఎంపిడివోలు, తహశీల్దార్లు, వ్యవసాయ, పోలీస్ అధికారులతో జిల్లా కలెక్టర్ వేడుకల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 21 రోజులపాటు జరిగే వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. జూన్ 3 న చేపట్టే తెలంగాణ రైతు దినోత్సవానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. రైతు వేదికలో చేపట్టే ఈ కార్యక్రమానికి, ఆయా క్లస్టర్ పరిధిలో వచ్చే గ్రామాల నుండి రైతులను సమీకరించాలన్నారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ ల ద్వారా రైతులు రైతు వేదికకు ఊరేగింపుగా చేరుకోవాలన్నారు. రైతు వేదికలను ఒకరోజు ముందస్తుగానే విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. సమావేశం ఏర్పాటుచేసి, రైతుబంధు, రైతు భీమా తదితర సంక్షేమ పథకాలపై వివరించాలని, రైతు బీమా లబ్ది పొందిన కుటుంబంతో వారు పొందిన సాయం గురించి వారితోనే పంచుకోవాలని అన్నారు. ముందస్తు సాగు, పంట మార్పిడిలపై అవగాహన కల్పించి, ప్రయోజనాలను వివరించాలన్నారు. జూన్ 8న చేపట్టే ఊరూరా చెరువుల పండుగకు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. గుర్తించిన చెరువుల వద్ద గంగమ్మతల్లి పూజలు అనంతరం ఒకప్పటి చెరువు, ఇప్పుడు వేసవిలో నిండు చెరువుపై వివరించాలన్నారు. కార్యక్రమం జరిగే చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సురక్షిత చర్యలు చేపట్టాలన్నారు. జూన్ 9న చేపట్టే తెలంగాణ సంక్షేమ సంబరాల్లో ఇండ్ల పట్టాలు, గొర్రెలు, బిసి సంక్షేమ శాఖ ద్వారా చెక్కుల పంపిణీ చేపట్టాలన్నారు. జూన్ 19న చేపట్టే హరితోత్సవానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ రోజున పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. ప్లాంటేషన్ కి స్థలాలను గుర్తించి పిట్టింగ్, మొక్కల రవాణా తదితర పనులు ముందస్తుగా చేయాలని ఆయన తెలిపారు.
సమావేశంలో పొలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, 21 రోజులు పోలీస్ శాఖ, సంబంధిత శాఖలతో ఒక టీమ్ గా పనిచేయాలన్నారు. సమూహం ఎక్కువగా వున్న వేడుకల్లో పోలీస్ శాఖ క్రియాశీలక పాత్ర పోషించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. జూన్ 4న భద్రతా దినం, 8న ఊరూరా చెరువుల పండుగ, 12న తెలంగాణ రన్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతిరోజు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

- Advertisement -
 ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగలి, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్ సింగ్, డిఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎసిపిలు తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News