ఒకవేళ మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశాన్ని తూకంలో పెట్టి మరీ బడా కార్పొరేట్ సంస్థలకు అమ్మడం ఖాయమని సీపీఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం సీపీఎం పార్టీ ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రమణగుట్ట, బూరన్ పురం, nst రోడ్, రేవతి సెంటర్, మామిళ్ళగూడెం తదితర ఏరియాలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టిన ఘనత మోడీ కే దక్కుతుంది అని విమర్శించారు. దోచుకోవడం, దాచుకోవడం పని మీద మాత్రమే మోడీ అనుచరులు వున్నారు అని ఆరోపించారు. మోడీ కి బినామీ గా అదానీ వున్నారని, అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయడానికి మోడీ నిరాకరణ చేశాడని ఆరోపించారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహిలు అని ముద్ర వేయడం మోడీ ప్రభుత్వానికి ప్యాషన్ అయిపోయింది అని విమర్శించారు.
దేశంలో మత కల్లోలాలు అమాంతంగా పెరగటానికి కారణం మోడీ విధానాలే కారణం అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు నర్రా రమేష్, హుస్సేన్, నాగరాజు, భద్రం, వెంకన్న, గౌస్, బుడేన్, ఉపేంద్ర నాయక్, రవీంద్ర, కుమారి, జె వెంకన్న బాబు, ఫకీరు సాహిబ్, శోభారాణి, జలగం అనిల్ కుమార్, లోకేశ్వరావు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.