ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఊరువాడ తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శీనన్న జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. పొంగులేటి అభిమానులు బైక్ ర్యాలీలతో ఉమ్మడి ఖమ్మంజిల్లాను హెూరెత్తించారు. పురవీధులన్నీ శీనన్న కటౌట్లు, ప్లెక్సీలు, భారీ హెర్డింగ్ లతో నిండిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి పల్లెల్లో శీనన్న పుట్టిన రోజు వేడుకల కోలాహలమే కనిపించింది. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొంగులేటి శీనన్న పిలుపు మేరకు ఆయన అభిమానులు, కాంగ్రెస్ నేతలంతా సమాజ, సామాజిక కార్యక్రమాల్లోనే నిమగ్నమయ్యారు.
- ఖమ్మం, కూసునుంచి క్యాంపు కార్యాలయాల్లో..
మంత్రి పొంగులేటి ఖమ్మం, కూసుమంచి క్యాంపు కార్యాలయాల్లో పుట్టినరోజు సంబురాలు అంబరాన్నంటాయి. ఖమ్మం క్యాంపు కార్యాలయంలో క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మద్దినేని బేబి స్వర్ణకుమారి, బాణోతు విజయబాయి, గుమ్మా రోశయ్య, హరినాథబాబు, కల్లెం వెంకట్ రెడ్డి, మద్ది మల్లా రెడ్డి, కొప్పుల అశోక్, కొంగర జ్యోతిర్మయి, కీసర పద్మజా రెడ్డి, కర్లపూడి భద్రకాళి, పంతులు నాయక్, భీమనాథుల అశోక్ రెడ్డి, లింగాల రవికుమార్, గురుప్రసాద్, మియాభాయ్, కిలారు మనోహర్, ఉమ్మినేని కృష్ణ, కానుగుల రాధాకృష్ణ, మద్ది కిశోర్ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సహా వందలాది మంది పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పీఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జెండా ఊపి దయాకర్ రెడ్డి ప్రారంభించారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో దుంపల రవికుమార్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, రక్తదాన శిబిరాలను నిర్వహించారు.
- ఖమ్మం, పాలేరు నియోజకర్గాల్లో….
ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో శీనన్న పుట్టిన రోజు సంబురాలను కోలాహలంగా నిర్వహించారు. రామన్నపేటలో బండి మనోజ్ ఆధ్వర్యంలో బొమ్మస్వామి గుడి వద్ద రక్తదాన శిబిరాన్ని, దానవాయిగూడెంలో చల్లా కృష్ణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఖమ్మం కైకొండాయిగూడెంలో నాగటి ఉపేందర్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు, రక్తదాన శిబిరాలను చేపట్టారు. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులో సురేష్ నాయక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని, రాజీవ్ గృహకల్పలో రూరల్ మండల కమిటీ, పీఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా మిషనరీ చారిటీలో అన్నదాన కార్యక్రమం జరిపారు. ఖమ్మంలోని జీవన సంధ్యా వృద్ధాశ్రమం, అన్నం ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. బోనకల్, ముదిగొండ మండలాల్లోనూ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కల్లూరు మండలం నారాయణపురంలో పొంగులేటి నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు వస్త్రాల పంపిణీ, పేద విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.
- కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల ముగింపు రోజున విజేతలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు.