ఖమ్మం నగర బీఅర్టీయూ అధ్యక్షుడు బుర్రి వినయ్ ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికుల వేతనాలు పెంచినoదుకు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసిఆర్ చిత్ర పటానికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మంత్రి అజయ్ కుమార్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంనకు నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా ఛైర్మెన్ విజయకుమార్, నగర బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడుతూ….కార్మికుల పక్షపాతి అయిన సీఎం కేసిఆర్ 2014 లో రూ.8000 వెలు వున్న మునిసిపల్ కార్మికుల వేతనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక 13500 వేలకు పెంచారన్నారు. అదే విధంగా నూతనంగా నిర్మించిన సచివాలయానికి బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయం గా నామకరణం చేసిన రోజే మరోసారి కార్మికుల వేతనాలను రూ. 1000 పెంచుతూ తొలి సంతకం చేశారన్నారు. మరొకసారి కెసిఆర్ గారు కార్మికుల పక్షపాతిగా నిలిచారని ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారన్నారు. కార్మికుల వేతనాలు పెంచినందుకు సీఎం కేసిఆర్ కు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కార్మికుల పక్షాన వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కిరణ్, తిరుమలరెడ్ , జ్యోతి ,వెంకటేష్, రవి, ఉపేందర్, సత్య, సునీత, మంగమ్మ, లక్ష్మీనారాయణ, కృష్ణ, నాగమణి, సులోచన, రాధ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.