Tuesday, September 17, 2024
HomeతెలంగాణKhammam: మాట నిలుపుకున్న మంత్రి పువ్వాడ

Khammam: మాట నిలుపుకున్న మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన మాట నిలుపుకున్నారు. ఇప్పటికే ఖమ్మం నగర జర్నలిస్ట్ లకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ హామీ మేరకు 5ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం ప్రత్యేక Go జారీ చేసింది. 5 ఎకరాలు స్థలం సరిపోదని, అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఅర్ ను కోరిన స్థానిక ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి మేరకు నేడు హైద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఅర్ ఆమోదం తెలిపారు. ఇప్పటికే స్థలం గుర్తించామని, ప్రతి జర్నలిస్టుకూ 200 గజాలు ఇవ్వనున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పని చేసే జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు పంపిణీ చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News