Thursday, September 19, 2024
HomeతెలంగాణKhammam: సోలార్ పార్కింగ్ షెడ్ నిర్మాణం

Khammam: సోలార్ పార్కింగ్ షెడ్ నిర్మాణం

ప్రగతిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పరిశీలించారు

ఖమ్మం ఐడిఓసి లో అధికారులు, సిబ్బంది వాహనాల పార్కింగ్ కొరకు రూ. 100.78 లక్షలతో నిర్మిస్తున్న సోలార్ పార్కింగ్ షెడ్ నిర్మాణ ప్రగతిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పరిశీలించారు. పనులు పురోగతిలో ఉన్నట్లు, 6 షెడ్ల నిర్మాణానికి గాను 3 షెడ్ల నిర్మాణం పూర్తయినట్లు ఆయన అన్నారు. పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ సోలార్ షెడ్ తో 100 కిలో వాట్ సోలార్ పవర్ ప్లాంట్, గ్రిడ్ కు అనుసంధానం చేస్తారని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News