Tuesday, September 17, 2024
HomeతెలంగాణKhammam: ప్రధాని పర్యటనను నిరసించండి: కూనంనేని

Khammam: ప్రధాని పర్యటనను నిరసించండి: కూనంనేని

రాష్ట్రం పట్ల వివక్షత చూపుతూ తెలంగాణ సిరుల తల్లిగా పేరొందిన సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు యత్నిస్తున్న ప్రధాని మోడీ పర్యటనను భారత కమ్యూనిస్టు పార్టీ నిరసిస్తున్నట్టు సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణలో బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తున్న మోడీ బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలలో బొగ్గు నిక్షేపాలను కోల్ ఇండియాకు అప్పగించారని సాంబశివరావు ఆరోపించారు.  విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయకపోగా ప్రధాని స్థాయిలో మోడీ అబద్ధాలు చెబుతున్నారని ఆయన తెలిపారు. కోయగూడెం ఓ.సి.ని అరవిందో కంపెనీకి అప్పగించారని ఆయన అన్నారు. గతంలో మోడీ వచ్చినప్పుడు సైతం రాష్ట్ర సమస్యలను పరిష్కారించాలని ర్యాలీ నిర్వహించామని అయినా మోడీ వైఖరి మారకపోవడంతో ఇప్పుడు ప్రధాని పర్యటనను నిరసిస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్రానికి ఒక ఐ.ఎ.ఎం. ఐ.ఐ.టి, మెడికల్ కాలేజి ఇవ్వని మోడీ ఈనెల 8న హైదరాబాదు పర్యటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను చేపడతామన్నారు.

- Advertisement -

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ టెర్రరిస్టు కంటే ప్రమాదమని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చలగాటమాడేందుకు ప్రయత్నించిన బండి సంజయ్ క్షమించరాని నేరం చేశాడని సాంబశివరావు ఆరోపించారు. టి.ఎస్.పి.ఎస్. ప్రశ్నా పత్రం లీకేజీకి సంబంధించి రాజశేఖర్ రెడ్డి ఎవరు? ఆయనకీ బీజేపీ ఉన్న లింక్ ఏమిటో తేల్చాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. టి.ఎస్.పి.ఎస్.సి. ప్రశ్నాపత్రాల లీకేజికి సంబంధించి చైర్మెన్ జనార్ధన్రెడ్డిని విధుల నుంచి తొలగించాలని సి.పి.ఐడిమాండ్ చేసిందని మొత్తం లీకేజి వ్యవహారం పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. 30 లక్షల మంది జీవితాలకు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించి దోషులను కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలు పునావృతం కాకుండా చూడాలన్నారు.

రాష్ట్రంలో పోరాడేది మేమే

రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులేనని సాంబశివరావు తెలిపారు. కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు రైతులు యువత సమస్య పరిష్కారం కోసం కమ్యూనిస్టులు పోరాడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ జిఓ నెంబర్ 58 ద్వారా రెగ్యురైజ్ చేసి పట్టాలివ్వాలని, ఇంటికి 5 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సి.పి.ఐ. సమితి సభ్యులు బాగం హేమంతరావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర సమితి సభ్యులు , జితేందర్ రెడ్డి, ఎస్.కె. జానిమియా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News