Saturday, October 5, 2024
HomeతెలంగాణKhanapur: కారు జోరు పెంచుతున్న పూర్ణ చందర్ నాయక్

Khanapur: కారు జోరు పెంచుతున్న పూర్ణ చందర్ నాయక్

రోజు రోజుకి తన క్యాడర్లో పెరుగుతున్న జోష్ కి కారణం అధిష్టానం నుంచి స్పష్టమైన హామీయేనా? రోజు రోజుకీ ఖానాపూర్ నియోజక వర్గ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్న బధావత్ పూర్ణ చందర్ నాయక్. గత రెండు సంత్సరాలుగా నియోజకవర్గంలోని అన్ని మారుమూల ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆది నుండి పూర్ణ నాయక్ అందరితో మమేకమై, ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎంతో కాలంగా కొంతమంది బడా లీడర్లు వ్యతిరేకిస్తుండగా అలాంటి అసంతృప్తులను ఇతర పార్టీలతో జతకట్టకుండా వారికి స్పష్టమైన హామీలు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉండేలా చేయడంలో సఫలీకృతం అయ్యారు.

- Advertisement -

నియోజకవర్గంలో జరిగిన ఇంటెలిజెన్స్, ఐ ప్యాక్, పార్టీ అధినేత కెసిఆర్ కనుసన్నల్లో జరిగిన వరుస సర్వేలలో తన పేరు ముందు వరుసలో ఉందనే లీకేజీలు అధిష్టానం నుండి రావడంతో తన కేడర్ ఫుల్ జోష్ లో ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతానికి నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా స్థానికేతరులు పాగా వేయడంతో స్థానికత అంశం బలంగా జనాల్లో నాటుకుపోయింది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో స్థానికుడు అయిన పూర్ణచందర్ నాయక్ కి బీఆర్ఎస్ నుండి టికెట్ వస్తే పార్టీలకు అతీతంగా పూర్ణ చందర్ నాయక్ కి మద్దతుగా ప్రజలు ఉన్నారనేది కాదనలేని వాస్తవం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News