ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) ఫైనల్లో భారత జట్టు గెలవడంతో దేశమంతా టపాసులు కాల్చి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అలాగే తెలంగాణలోని హైదరాబాద్ సహా కరీంనగర్‌లో రోడ్లపైకి వచ్చి యువత సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో పోలీసులు అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. సంబరాలు చేసుకుంటున్న యువతపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
భారత్ విజయోత్సవాలను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం సిగ్గు చేటని కిషన్ రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
కరీంనగర్ పోలీసులు ఏ దేశానికి మద్దతు ఇస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. భారతదేశంలో భారత విజయాన్ని జరుపుకోలేము.. కానీ పాకిస్తాన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీని తొలగిస్తారా? అంటూ ప్రశ్నించారు. భారత విజయాన్ని జరుపుకోవడం మతపరమైన సమస్యగా ఎలా మారుతుంది? అని నిలదీశారు.