Thursday, July 4, 2024
HomeతెలంగాణKishan Reddy: వరంగల్​ సభను సక్సెస్​ చేయండి

Kishan Reddy: వరంగల్​ సభను సక్సెస్​ చేయండి

ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్​ సభను సక్సెస్​ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డి కోరారు. ఈ రోజు ఉదయం భారీ కాన్వాయ్​తో హైదరాబాద్​ నుంచి వరంగల్ చేరుకున్న ఆయన.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రధాని సభ జరిగే ఆర్ట్స్​ కాలేజీ గ్రౌండ్​లో ఏర్పాట్లను పరిశీలించిన అనంత అక్కడే మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

– రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్​ యూనిట్​, జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రధాని భూమి పూజ చేస్తారు.
– తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తున్నది.
– తెలంగాణలో కేసీఆర్​ కుటుంబం ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తున్నాం.
– కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్​హౌజ్​కు పరిమితం చేయాలి.
– రాష్ట్ర అభివృద్ధి కోసం ఈసారీ బీజేపీని ఆశీర్వదించాలని ప్రధాని మోడీ కోరనున్నారు.
– మంత్రులు,ముఖ్యమంత్రి సచివాలయంకు పోయే పరిపాలన కావాలి.
– బీఆర్​ఎస్​, బీజేపీ ఎప్పుడూ కలిసిన దాఖలాలు లేవు.. ఇతర పార్టీలు చేసే విషప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు
– కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ గతంలో అనేకసార్లు కలిశాయి.రాష్ట్రపతి ఎన్నిక సమయంలో కాంగ్రెస్​ పార్టీకి మద్దతుగా కేసీఆర్​ మాట్లాడిన విషయం గుర్తుంచుకోవాలి. అవి రెండు బొమ్మ బొరుసు పార్టీలు.
– గతంలో 18 చోట్ల కాంగ్రెస్ గెలిస్తే..12 మంది బీరెస్ పార్టీలోకి జంప్ అయ్యారు.
– బీజేపీ మాత్రమే కుటుంబపాలనను అంతమొందించగలదు
– బీజేపీ మాత్రమే న్యాయమైన పాలన చేయగలదు.
– గత 9 ఏండ్లుగా మోడీ ప్రభుత్వం నీతిమంతంగా పనిచేస్తున్నది.
– మంచి ప్రభుత్వం తెలంగాణకు అందిస్తాం.
– చాలా ఏండ్ల తర్వాత భారత ప్రధానిగా మోడీ వరంగల్​కు వస్తున్నారు.
– వరంగల్​ నుంచి హైదరాబాద్​ వరకు సిమెంట్​ రోడ్డు వేయించిన ఘనత ప్రధాని మోడీది.
– వరంగల్​ జిల్లాకు టెక్స్​టైల్​ పార్క్​ కేంద్రమే మంజూరు చేసింది.
– వరంగల్​ అభివృద్ధి విషయంలో మోడీ ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నది.
– రైలు మ్యానుఫ్యాక్చరింగ్​ పరిశ్రమలో భవిష్యత్​లో రైలు ఇంజన్​ సహా.. వ్యాగన్లు, కోచ్​లు ఏమైనా తయారు చేసుకవ్చ్చు.
– అనుకున్నదానికంటే పెద్ద పరిశ్రమనే కాజిపేటకు వచ్చింది.
– బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్​ ఎయిర్​పోర్టు అంశం మొదటి
– కవిత అరెస్ట్ చూడాల్సిన పని బీజేపీది కాదు. సీబీఐ పని అది.
– కేసిఆర్ ది కమీషన్ల ప్రభుత్వం..
– కుటుంబ వాటాలు, పెత్తనం లేని పరిపాలన తెలంగాణలో తీసుకువస్తాం.
–మామునూర్ ఎయిర్ పోర్ట్ స్థలం విషయంలో నేను, మా అధికారులు రాష్ట్రానికి ఎన్నోసార్లు లెటర్స్ రాశాం.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే వరంగల్ యెయిర్ పోర్ట్ కు మొదటి ప్రాధాన్యత.
ఎయిర్ జర్నీని బీజేపీ ప్రోత్సాహిస్తుంది.
ఓరుగల్లు జనాలు మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.
స్మార్ట్ సిటీ, అమృత్ వంటి స్కీమ్స్ ఇచ్చాము. పీఎం మిత్ర ద్వారా మెగా టెక్స్ టైల్ పార్క్ కు కేంద్రం నిధులు, 550 కోట్లతో జాతీయ రహదారి అనుసంధానం
మెగా టెక్స్ టైల్ పార్క్ రావడానికి స్టేట్ తరఫున కృషి చేశాను

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News