Saturday, November 15, 2025
HomeతెలంగాణKomatireddy Fires On CM: పదవులు, పైసలూ మీకేనా: సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్..!

Komatireddy Fires On CM: పదవులు, పైసలూ మీకేనా: సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్..!

Minister Komatireddy Rajagopal Reddy Fires on CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న ఆయన, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “పదవులు మీరే తీసుకుంటున్నారు.. పైసలు కూడా మీకేనా?” అంటూ ప్రశ్నించిన ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

- Advertisement -

మంత్రి పదవి వివాదం:

మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం లభించకపోవడంపై కోమటిరెడ్డి గత కొంతకాలంగా బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చిందని, తన పనితీరును గుర్తించి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అన్నదమ్ములిద్దరికీ (కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి) మంత్రి పదవి ఇస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/singareni-women-rescue-team-underground-mining/

నిధుల కేటాయింపుపై నిరసన:

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో జరిగిన ఒక కార్యక్రమంలో కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. గత 20 నెలలుగా మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు రాలేదని ఆరోపించారు. రోడ్లు, భవనాల నిర్మాణాల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, ఈ విషయమై మంత్రిని వందసార్లు కలిసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రశ్నించక తప్పడం లేదని స్పష్టం చేశారు. తాను పార్టీని లేదా ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాకపోవడంపైనే తన ఆవేదన అని ఆయన వివరించారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/indiramamma-houses-inauguration-telangana-revanth-reddy-august-21/

మంత్రి పదవి వస్తేనే న్యాయం:

“వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు నిర్మాణ పనులు బిల్లులు రాకపోవడంతో నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి ఆదేశిస్తేనే ఆ బిల్లులు విడుదలవుతాయి” అని కోమటిరెడ్డి అన్నారు. తన అసంతృప్తికి గల కారణాన్ని స్పష్టం చేస్తూనే, తనకు మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకు న్యాయం చేయగలనని అభిప్రాయపడ్డారు. మంత్రి పదవి అనేది అధిష్ఠానం నిర్ణయమని, పదవి రావలసి ఉంటే ఎవరూ ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాలని, వారి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad