ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల పరిధి జాపాల గ్రామంలో పలు అభివృద్ధి పనుల కొరకు సిసి రోడ్లు అండర్ డ్రైనేజీ వీధి దీపాల పనుల గురించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి, జపాల గ్రామంలో ఉన్న పలు సమస్యలపై చర్చించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని తమ సహాయ సహకారాలు అందించాల్సిందిగా జాపాల సర్పంచ్ నహిదా బేగం రహుఫ్ కోరారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందించి తన ఎంపీ నిధుల నుండి వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ ఆదిల్, సయ్యద్ రహుఫ్ పాల్గొన్నారు.