Sunday, November 16, 2025
HomeతెలంగాణKomuravelli: ఆన్లైన్లో కొమురవెల్లి మల్లన్న టికెట్లు ..దాచారం గుట్టను కాపాడమంటున్న బీజేపీ

Komuravelli: ఆన్లైన్లో కొమురవెల్లి మల్లన్న టికెట్లు ..దాచారం గుట్టను కాపాడమంటున్న బీజేపీ

కొమురవెల్లి దేవస్థానం గుట్టను అనుకొని ఉన్న దాచారం గుట్టను ప్రైవేటు వ్యక్తుల నుండి సేకరించి దేవాలయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. దాచారం గుట్ట దేవాలయానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని.. సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. మల్లన్న దేవాలయం టికెట్లను ఆన్లైన్ చేయాలని, టిక్కెట్ల అమ్మకాలలో అవినీతికి చెక్ పెట్టాలంటే ఇదొక్కటే మార్గమని విజ్ఞప్తి చేశారు. కాగా.. 15 రోజుల్లో ఆన్లైన్ టికెట్లు సర్వీసు ప్రారంభిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. మల్లన్న దర్శనానికి వచ్చే యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని…అధునాతన క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని కూడా బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad