Friday, September 20, 2024
HomeతెలంగాణKomuravelli: ప్రశాంతంగా కొమురెల్లి మల్లన్న అగ్నిగుండాల

Komuravelli: ప్రశాంతంగా కొమురెల్లి మల్లన్న అగ్నిగుండాల

కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల తొమ్మిదవ ఆదివారం చివరి వారం (అగ్నిగుండాల) సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.. దర్శనానికి వచ్చే భక్తులు పోలీసు వారి సలహాలు సూచనలు పాటిస్తూ మల్లికార్జున స్వామిని ప్రశాంతంగా దర్శించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.దర్శనం సజావుగా జరిగేటట్టు పోలీసు వారు తగిన బందోబస్తు నిర్వహించారు. అగ్నిగుండాలు నిర్వహించే ప్రదేశంలో బందోబస్తును పర్యవేక్షించి వారికి తగిన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసిపి సతీష్, సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి ఫనేందర్, చేర్యాల సీఐ సత్యనారాయణ రెడ్డి, తోగుట సిఐ కమలాకర్, కొమురవెల్లి ఎస్ఐ చంద్రమోహన్, జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News