రైతులకు 65% సబ్సిడీ జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొమురవెల్లి జడ్పిటిసి సిలువేరు సిద్ధప్ప అన్నారు. కొమురవెల్లి మండలంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో 65 శాతం సబ్సిడీ జీలుగా విత్తనాల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు జీలుగా విత్తనాల గురించి అవగాహన కలిగి ఉండాలని జీలుగు విత్తనాలు (పచ్చిరొట్ట) పొలంలో అలకడం వల్ల రైతులకు ఎంతో లాభదాయకమని దీనివల్ల రైతులు కంపోస్ట్ ఎరువులు తగ్గించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గిస బిక్షపతి, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ కనకచారి, కొమురవెల్లి ఎంపీటీసీలు లింగంపల్లి కవిత, కనకరాజు, ఆగ్రో రైతు సేవా కేంద్రం నిర్వాహకుడు తాళ్లపల్లి కనకయ్య గౌడ్, స్వామి, బిక్షపతి వెంకటేశం రైతులు తదితరులు పాల్గొన్నారు.