Friday, November 22, 2024
HomeతెలంగాణKonda Surekha: సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకుందాం

Konda Surekha: సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకుందాం

కాంగ్రెస్ పార్టీయే బడుగు బలహీన వర్గాలకు అండ

వరంగల్ తూర్పు 42వ డివిజన్ రుద్రమాంబ నగర్ కాలనీలో స్థానిక నాయకులు పూసల కిరణ్, దామర కొండ కరుణాకర్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు, యువకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని కొండా సురేఖ సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని, రాబోయే ఎన్నికలలో హస్తం గుర్తుకు ఓటు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకుందామని ఆమె అన్నారు. యువకులకు, నిరుద్యోగులకు, మహిళలను ఉద్దేశించి ఆరు గ్యారెంటీ పథకాలను ప్రవేశపెట్టిందని, రాష్ట్రాన్ని తద్వారా వరంగల్ తూర్పు నియోజకవర్గంను అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఇవ్వండి అని అభ్యర్థించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News