Saturday, October 5, 2024
HomeతెలంగాణKonda Visweswar Reddy challenge: దమ్ముంటే స్థానికులకు ఇళ్లివ్వాలి

Konda Visweswar Reddy challenge: దమ్ముంటే స్థానికులకు ఇళ్లివ్వాలి

శంకర్‌పల్లి మున్సిపల్ పట్టణ శివారులో నిర్మించిన 1512 డబుల్ బెడ్రూం ఇళ్లను స్థానికులకు కాకుండా, కార్వాన్, యాకుత్ పుర నియోజకవర్గాల ప్రజలకు కేటాయించడాన్ని చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బిజెపి అధికార ప్రతినిధి తొండ రవి తీవ్రంగా ఖండించారు. పట్టణ కేంద్రంలోని మండల రెవెన్యూ కార్యాలయ ఆవరణలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు స్థానికులకు కేటాయించాలని బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి హాజరై మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే యాదయ్య, బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే స్థానికులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

కోట్ల రూపాయల విలువ చేసే తమ భూముల్లో ఇళ్లు నిర్మించి, స్థానికేతరులకు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు? శంకర్‌పల్లిలో నిర్మించిన ఇళ్లలో నియోజకవర్గానికి కేవలం 151 ఇళ్లు మాత్రమే కేటాయించడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి స్థానికులకు ఇళ్లు కేటాయించాలని, లేనిపక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహసిల్దార్ కు నాయకులంతా కలిసి స్థానికులకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. సమావేశంలో బీజేపీ చేవెళ్ల ఇన్చార్జి ప్రతాప్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు బిర్లా సురేష్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రాజేందర్ సింగ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, మొయినాబాద్, చేవెళ్ల, నవాబుపేట, షాబాద్ మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు ప్రభాకర్ రెడ్డి, నర్సింహ్మారెడ్డి, అనిశెట్టి సురేష్, హర్షవర్ధన్, నందు, రాజచంద్ర, ఎర్రోళ్ల రాజ్ కుమార్, ప్రశాంత్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, లోకేష్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News