Friday, November 22, 2024
HomeతెలంగాణKorukanti Chander: 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే ప్రజలకు అష్ట కష్టాలు

Korukanti Chander: 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే ప్రజలకు అష్ట కష్టాలు

దేశానికే ఆదర్శవంత పాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి

కాంగ్రెస్ పాలన అంటేనే అంధకారం 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే ప్రజలకు అష్ట కష్టాలు తొమ్మిదేళ్ల సీఎం కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని దేశానికే ఆదర్శవంత పాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 17వ డివిజన్ సంతోష్ నగర్ లో భరోసా బస్తీ బాట కార్యక్రమం ఎమ్మెల్యే చేపట్టారు. పది లక్షల రూపాయల పట్టణ ప్రగతి నిధులతో నూతన సిసి రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక ప్రజాహిత సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రతి ముఖంలో సంతోషం నింపుతున్నరని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు పట్టణ ప్రగతి ద్వారా ప్రతినెల నిధులను వెచ్చించి అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలు అయిందని వారి పాలన మూలంగానే ప్రజలకు అష్టకష్టాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో డివిజన్ లోని అభివృద్ధికి నోచుకోకపోవాడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నరన్నారు. తెలంగాణ ప్రజలందరూ సీఎం కేసీఆర్ ను హ్యట్రిక్ సీఎం గా గెలిపించాలని కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజల రుణం తీసుకునే విధంగా ప్రజల కోసం కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చామని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాలను ప్రారంభించామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సాగంటి శంకర్, శంకర్ నాయక్ బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు సదయ్య, రాంచెందర్, రాకేష్ కుమార్, ప్రశాంత్, రమేష్, శ్రీనివాస్ నాసంని ఓదేలు, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News