Saturday, November 23, 2024
HomeతెలంగాణKorukanti Chander: రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ

Korukanti Chander: రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ

సీఎం కెసిఆర్ పాలనంటే ప్రగతి పథం, సంక్షేమ రధం

తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ, 60 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలన ద్వారానే ఈ ప్రాంతమంతా అష్ట కష్టాలపాలైదని అంధకారం నెలకొందనీ కాంగ్రెస్ ను నమ్మితే మోసపోతాం, గోస పడతామని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామంలో ఎమ్మెల్యే ప్రజా అంకిత యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. ప్రజలు, మహిళలు మంగళ హారతులతో ఎమ్మెల్యే స్వాగతం చెప్పారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ పేదల కన్నీళ్ళు తుడిచిన మహా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం ప్రతి ముఖంలో ఆనందాన్ని నింపుతూ తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టి సిఎం కేసీఆర్‌ కాపాడుకుంటున్నారనీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అందని గడప లేదని అన్నారు.

అన్నం పెట్టే రైతన్నకు సిఎం కేసీఆర్‌ వెన్నుముక అయ్యారని, రైతులకు కావాల్సిన సకల సదుపాయాలను సీఎం కేసీఆర్ కల్పిస్తున్నారని చెప్పారు. రైతులను రాజుల చేయాలనే సంకల్పంతో 24 గంటల ఉచిత కరెంటు రైతుబంధు రైతుబంధు సకాలంలో ఎరువుల పంపిణీ తోపాటు ఎవరైనా రైతు దురదృష్టవశాత్తూ మరణిస్తే వారి కుటుంబం కష్టాలు పడవద్దనీ వారికి ఐదు లక్షల రూపాయల రైతు బీమా సౌకర్యాన్ని అందిస్తూ ఘనత సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలకులు రైతుల పట్ల నిర్లక్ష్యం వ్యవరించారన్నారు. రైతాంగానికి సాగునీరు అందించకుండా రైతులను కష్టాలకు గరి చేసారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రామగుండం నియోజకవర్గంలోని రైతాంగానికి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు 80 కోట్ల రూపాయలతో బ్రాహ్మణపల్లి వద్ద లిప్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

త్వరలోనే పనులు పూర్తి కానున్నయని పాలకుర్తి మండలం లోని బండాలవాగు ప్రాజెక్టును ఎల్లంపల్లి నీళ్ల తరలిస్తామన్నారు. గ్రామంలోని పెద వారికి గృహలక్ష్మి పధకం మాంజురు చెస్తామన్నారు. గ్రామంలో మంచినీటి నల్ల కనెక్షన్ కోసం 5 లక్షల రూపాయలు మాంజురు చేసామని గ్రామంలో నల్ల కనెక్షన్ లేనివారికి వెంటనె అందిచాలన్నారు. గ్రామంలో కోతుల బెడద ఉందనీ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికీ తీసుకురాగా వారం రోజుల్లో సమస్యను పరిష్కారం చెస్తామన్నారు. మన కోసం ఆలోచించే ప్రభుత్వాన్ని ఆశీర్వాదించాలనీ రాబోవు ఎన్నికల్లో కారు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి నాయకులు కౌశిక హరి, సర్పంచ్ లు గొండ్ర చందయ్య, కొల లత ఎం.పి.టీ.సి గంగధరి రమెష్ , ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్ పాలకుర్తి మండల పార్టీ అధ్యక్షుడు ఇంజపురి నవీన్ నాయకులు రావుల సాగర్ కుదరే సతీష్, మధన్ మెాహన్ రావు శ్రీపతి శంకరయ్య పర్లపల్లి రవి నారాయణదాసు మారుతి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News