Sunday, October 6, 2024
HomeతెలంగాణKorukanti Chander: ప్రజా సంక్షేమం కోసం ఎమ్మెల్యే హోమం

Korukanti Chander: ప్రజా సంక్షేమం కోసం ఎమ్మెల్యే హోమం

బిఆర్ఎస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలవాలి

రామగుండం నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవనం కొనసాగించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్థానిక జవహర్ నగర్ స్టేడియం వద్ద గల జయ దుర్గాదేవి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి హోమం చేశారు.

- Advertisement -

రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలవాలని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో పాలన సాగించాలని ఎమ్మెల్యే అమ్మ వారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఆయన కొడుకు-కోడలు మణిదీప్, స్నేహిత దంపతులు తదితరులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News