నిరుపేద ప్రజల వైద్యం కోసం అందిస్తున్నటువంటి ఎల్ఓసితో కార్పొరేట్ వైద్యంను పొందవచ్చునని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. స్థానిక అడ్డుకుంటపల్లికి చెందిన గుండారపు శ్రీనివాస్ అనే వ్యక్తి హిప్ వ్యాధితో బాధపడుతున్న తరుణంలో శ్రీనివాస్ ఎమ్మెల్యే చందర్ ను సంప్రదించారు. వెంటనే వైద్య చికిత్సకు అవసరమైన 2 లక్షల ఎల్ఓసిని బాధితునికి ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం సంక్షేమానికి, అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే చందర్ అన్నారు.
ప్రతి పేదవాడి ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ముందుగానే ఎల్ఓసి ద్వారా అందజేస్తామన్నారు. అదేవిధంగా కార్పొరేట్ ఆస్పత్రులలో చికిత్స పొందిన అనంతరం కూడా చికిత్సకు ఖర్చుపెట్టిన మొత్తంలో అధిక శాతాన్ని సైతం సీఎంఆర్ఎఫ్ ద్వారా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బి అర్ ఎస్ నాయకులు మారుతి, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.