సికింద్రాబాద్. సనత్ నగర్ నియోజక వర్గం నుండి తన విజయం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోట నీలిమ ధీమాను వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోట నీలిమ సనత్ నగర్ నియోజక వర్గం బేగం పేట డివిజన్ పాటి గడ్డలో పాదయాత్ర చేశారు. ఇల్లిల్లూ తిరుగుతూ కాంగ్రెస్ 6గ్యారంటీలను వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ ప్రజల నుండి తమకు మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు.. 10ఏళ్ల బీఆర్ఎస్ పాలన జరిగిన అభివృద్ది ఏమి లేదని సమస్యల వలయంలో చిక్కుకొని ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో ఉన్నారని వెల్లడించారు. అందుకే సనత్ నగర్ లో తమ విజయం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
Kota Nilima: కోట నీలిమ పాదయాత్ర
నా గెలుపు ఖాయం..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES