Sunday, April 13, 2025
HomeతెలంగాణMedaram: జాతరలో ప్రత్యేక ఆకర్షణగా కోయ దొరలు

Medaram: జాతరలో ప్రత్యేక ఆకర్షణగా కోయ దొరలు

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. జాతర సందర్భంగా మేడారం పరిసరాలు జన సందోహంతో నిండిపోయాయి. కోట్లాది మంది భక్తులు కొంగు బంగారం అయిన సమ్మక్క సారలమ్మ జాతరలో కోయ దొరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. దట్టమైన అడవులలో దొరికే అనేక రకాల వనమూలికల మొక్కలు, వేర్లు, చెట్ల కొమ్మలను తీసుకువచ్చి జాతరకు వచ్చే భక్తులకు విక్రయిస్తున్నారు.

- Advertisement -

తాము ఆదివాసిలం అని, అడవులలో జీవిస్తూ సమ్మక్క సారలమ్మల ఉపవాస దీక్ష చేపట్టి, నిష్ఠతో పూజలు నిర్వహించి, అన్ని రోగాలకు సంబంధించిన మూలికలను తమ పూర్వీకుల నుండి తెలుసుకొని, నేటికీ అదే విధానము కొనసాగిస్తూ ఎంతో మంది ప్రజలకు నయం చేసినట్లు చెబుతున్నారు. భక్తుల నమ్మకానికి అనుగుణంగా వారి వారి రోగాలు నయం అవుతాయని కోయ దొరలు జ్యోతిష్యంతో వారి జాతకం నిజమవుతుందనీ కొందరు భక్తులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News