Friday, January 10, 2025
HomeతెలంగాణKTR: ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ

KTR: ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ

ఫార్ములా-ఈ రేసు(Formula-E Race) కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెటంట్ కేటీఆర్‌ (KTR) ఏసీబీ విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు అధికారులు కేటీఆర్‌ను విచారించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్‌ కేటీఆర్‌ను విచారించగా.. జాయింట్‌ డైరెక్టర్‌ రితిరాజ్‌ పర్యవేక్షించారు. విచారణను వేరే గది నుంచి చూసేందుకు కేటీఆర్‌ న్యాయవాది రామచంద్రరావును అనుమతించారు.

- Advertisement -

విచారణ అనంతరం బయటికొచ్చిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణకు సహకరించానని తెలిపారు. తనకున్న అవగాహన మేరకు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. విచారణకు ఎప్పుడు పిలిచినా, ఎన్ని సార్లు పిలిచినా వచ్చి సహకరిస్తానని చెప్పానని పేర్కొన్నారు. ఇది అసంబద్ధమైన కేసు అని అధికారులకు చెప్పినట్లు చెప్పారు. పైసలు ఇక్కడి నుంచి పంపిచామని చెబుతున్నా.. పైసలు ఇక్కడున్నాయని వాళ్లు చెబుతున్నారని.. ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని అడిగా అని కేటీఆర్‌ వెల్లడించారు.

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు కేటీఆర్‌ను అడ్డుకున్నారు. ఇక్కడ మాట్లాడకూడదని.. పార్టీ ఆఫీసుకు వెళ్లి మాట్లాడాలని సూచించారు. దీంతో మీడియాతో మాట్లాడితే పోలీసులకు ఎందుకంత భయం అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News