ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఈడీ విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండీఏ(HMDA) ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ ప్రశ్నలు వేస్తోంది. ఈ నేపథ్యంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. దాదాపు 200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
కాగా ఈ కేసులో విచారణకు జనవరి 7న ఆయన హాజరుకావాల్సి ఉన్నప్పటికీ విచారణకు రాలేనని చెప్పారు. దీంతో జనవరి 16న విచారణకు హాజరు వాలని ఈడీ నోటీసులు పంపడంతో ఈడీ ఆఫీసుకు వెళ్లారు. ఇప్పటికే అధికారులు అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. కొన్ని రోజుల క్రితం ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. అక్కడ కూడా కేటీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది.