Janwada FarmHouse: జన్వాడ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల(Raj Pakala) తెలంగాణ హైకోర్టు(TG High Court)ను ఆశ్రయించారు. ఈ కేసులో పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సాయంత్రంలోపు విచారణ జరిపే అవకాశం ఉంది.
కాగా జన్వాడ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీపైన కేటీఆర్(KTR) క్లారిటీ ఇచ్చారు. అది ఫాంహౌస్ కాదని తన బామ్మర్ది ఇల్లు అంటూ పేర్కొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా కుటుంబసభ్యులందరూ కలిసి దావత్ చేసుకున్నారని స్పష్టంచేశారు. అందులో డ్రగ్స్ ఎవరూ వాడలేదని తెలిపారు. రాజకీయంగా తమ విమర్శలకు సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్నారు. అందుకే తమను రాజకీయంగా ఎదుర్కోలేక.. తన బంధువులపై కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదని కేటీఆర్ వెల్లడించారు.