Sunday, October 6, 2024
HomeతెలంగాణKTR: కేంద్ర ప్రభుత్వ pm మిత్ర పథకానికి తెలంగాణ స్ఫూర్తి

KTR: కేంద్ర ప్రభుత్వ pm మిత్ర పథకానికి తెలంగాణ స్ఫూర్తి

మేడ్ ఇన్ పరకాల, మేడ్ ఇన్ వరంగల్ బట్టలు ఇక్కడి నుంచి ప్రపంచానికి ఎగుమతి కానున్నాయి

వరంగల్ కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్ లో young one కంపెనీ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కామెంట్స్: నల్ల బంగారం ఉంది. తెల్ల బంగారం కూడా ఉంది, ఇక్కడ పండే పత్తి అత్యుత్తమ, నాణ్యమైనది, సిరిసిల్ల, కొడకండ్ల లలో నేతన్నలు అందుకే ఉన్నారు. అందుకే సీఎం కెసిఆర్ పట్టుబట్టి గతంలో అజమ్ జాహీ మిల్లు ఉన్న ప్రాంతంలోనే కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేశారు. ఈ టెక్స్ట్ టైల్ పార్క్ ఏర్పాటులో చల్లా ధర్మారెడ్డి కృషి ఎనలేనిది. ఆయన అందరినీ ఒప్పించి ఈ టెక్స్ట్ టైల్ పార్క్ ను ప్రారంభించడానికి శ్రమ పడ్డారు. పార్క్ కోసం తమ స్థలాలను ఇచ్చిన రైతులకు పరిహారంగా ఆగస్టు 15లోగా ఆయా రైతుల కుటుంబాలకు అభివృద్ధి పరచిన 100 గజాల స్థలాన్ని ఇవ్వాలి. ‘ఫామ్ to ఫ్యాషన్’ అనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ మెగా పార్క్ లో ఉత్పత్తులను త్వరగా ప్రారంభించి, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. కి టెక్స్ట్, గణేష్ షా కంపెనీలు పనులు ప్రారంభించాయి, 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే, కాగా అందులో 80 శాతం ఉద్యోగాలు మహిళలకు వచ్చేలా కృషి జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయి దుస్తులు ఇక్కడ తయారవుతాయి.

- Advertisement -

మేడ్ ఇన్ పరకాల, మేడ్ ఇన్ వరంగల్ బట్టలు ఇక్కడి నుంచి ప్రపంచానికి ఎగుమతి కానున్నాయి. దేశంలో వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మంచి ఉత్పత్తి, ఉపాధి వస్తుంది, ప్రపంచ దుస్తుల ఉత్పాదనలో బంగ్లాదేశ్ లో 8 శాతం, శ్రీలంకలో 7 శాతం బట్టలు తయారీ అవుతుండగా, దేశంలో కేవలం 4 శాతం బట్టలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి.

ఆలస్యంగా దేశంలోని కేంద్రం ప్రభుత్వం మేల్కొంది. Pm మిత్ర అనే పథకాన్ని ప్రారంభించింది. మన మిషన్ భగీరథ, రైతు బంధు వంటి అనేక పథకాలను కేంద్రం కాపీ కొట్టింది, తెలంగాణ ఆచరిస్తుంటే దేశం అనుసరిస్తున్నదన్నారు కేటీఆర్. దేశంలో 3 శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ, ఇవ్వాళ 30శాతం అవార్డులు పొందుతున్నదని, కేవలం 3 కంపెనీల ద్వారా 33 వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, మరో 30 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఐటీ పరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, టీఎస్ఐఐడిసి నరసింహ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, యంగ్వాన్ కంపెనీ చైర్మన్ కేహంగ్ చాంగ్, యాంగ్వాన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్ జాయ్ బాక్, యంగ్ వన్ కంపెనీ ఎండి షాజహాన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News