Monday, November 17, 2025
HomeతెలంగాణKTR: ఓట్ల కోసమే రామ జపమా..? బీజేపీపై కేటీఆర్ ఫైర్

KTR: ఓట్ల కోసమే రామ జపమా..? బీజేపీపై కేటీఆర్ ఫైర్

KTR Criticizes BJP: భద్రాచలం ఈవో రమాదేవిపై జరిగిన దాడి ఘటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. భదాద్రి రాములోరికి చెందిన భూములను పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గ్రామస్తులు అక్రమించుకోవడంపై ఆయన మండిపడ్డారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన భద్రాద్రి ఈవోపై కబ్జాదారులు దాడి చేసిన ఘటనపై తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఓట్ల కోసం మాత్రమే బీజేపీ నాయకులకు రామ జపం కావాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

బీజేపీ రామచంద్రా నోరు తెరవరేం? అని నిలదీశారు. రాములోరి భూములను ఆక్రమించుకుంటోంటే ఒక్క మాటైనా మాట్లాడరేం? అని ప్రశ్నించారు. మీ భాగస్వామి ప్రభుత్వం చెరలో ఉన్నాయని వదిలేస్తున్నారా? అని ఫైర్ అయ్యారు. లేక ఈసారి మొత్తం భద్రాద్రినే గంపగుత్తగా వారి చేతిలో పెడదామనుకుంటున్నారా? అని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసమే చేసే మీ రామజపాలను.. సీట్ల కోసమే వేసే మీ దొంగ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. మోడీతో మాట్లాడతారో..మీ దోస్తు దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం అన్నారు. భద్రాద్రిని మాత్రం కాపాడండి.. ఆక్రమణల చెర నుంచి విడిపించండని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కాగా ఇటీవల భద్రాచలం దేవాలయ ఈవో రమాదేవిపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. భద్రాచలం దేవస్థానానికి చెందిన భూములను అల్లూరు సీతారామరాజు జిల్లా పురుషోత్తపట్నం గ్రామస్తులు కబ్జా చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. భద్రాచలం ఆలయానికి పురుషోత్తపట్నంలో ఉన్న 889.50 ఎకరాల భూములు కబ్జాకి గురవుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం భూములను ఆలయానికి అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: భద్రాచలం ఆలయ ఈవోపై దాడి

అయితే హైకోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా ఇటీవల ఆ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు కూడా చేపట్టారు. సమాచారం తెలుసుకున్న ఆలయ ఈవో రమాదేవి నిర్మాణాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కబ్జాదారులు దాడికి దిగడంతో ఆమె స్పృహ కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మహిళా ప్రభుత్వ ఉద్యోగిపై దాడి జరగడం సంచలనంగా మారింది. ఈ దాడిని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. అధికారులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad