Wednesday, April 2, 2025
HomeతెలంగాణKTR: బుల్డోజర్లు, జేసీబీలపై రాహుల్ స్పందించాలి: కేటీఆర్

KTR: బుల్డోజర్లు, జేసీబీలపై రాహుల్ స్పందించాలి: కేటీఆర్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల వేలంపై రాజకీయ దుమారం రేగుతోంది. చెట్లను తొలగించి భూములను చదును చేసేందుకు జేసీబీలను అధికారులు భారీగా తరలించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. భూముల వేల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పటికైనా స్పందించాలనిడిమాండ్ చేశారు.

- Advertisement -

‘‘400 ఎకరాల విలువైన స్థలాన్ని నాశనం చేస్తూ గ్రీన్ మర్డర్‌కు పాల్పడుతున్నారు. ఆ స్థలంలో బుల్డోజర్లు, జేసీబీలు తిరుగుతున్నాయి. వాటిని చూసి అక్కడి నెమళ్లు సాయం కోసం చూస్తున్నాయి. ఇప్పటికైనా రాహుల్‌ గాంధీ నోరు విప్పరా?ఇవన్నీ చూస్తూ కూడా ఆయన మాట్లాడకపోతే ఎలా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ మేరకు కొన్ని వీడియోలు, ఫొటోలను తన పోస్టుకు జత చేశారు. ఇదిలా ఉంటే కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ (TGIIC) కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News