KTR| బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy)అరెస్టుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు. పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు, పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు. ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు . ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు. ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు. ప్రజలపై కేసులు. ప్రజాప్రతినిధులపై కేసులు
కేసులు .. కేసులు .. కేసులు. కాసులు మీకు – కేసులు మాకు. సూటుకేసులు మీకు .. అరెస్టులు మాకు. మాజీ మంత్రులు మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గార్లతోపాటు మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం..తక్షణం విడుదల చెయ్యాలి. జాగో తెలంగాణ జాగో” అంటూ కేటీఆర్ వెల్లడించారు.