Saturday, November 23, 2024
HomeతెలంగాణKTR: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు సర్క్యులర్ ​ కాపీని అందజేసిన మంత్రి కేటీఆర్

KTR: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు సర్క్యులర్ ​ కాపీని అందజేసిన మంత్రి కేటీఆర్

సిక్స్​ మెన్ కమిటీ సభ్యులకు ..

హౌజింగ్ సొసైటీల్లో సభ్యత్వం లేని నగర పరిధిలోని అర్హతగల వర్కింగ్ జర్నలిస్టులకు సొంతింటి స్థలం అందించేందుకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ జర్నలిస్టుల యూనియన్ల నేతల భాగస్వామ్యంతో ఏర్పడ్డ సిక్స్ మెన్ కమిటీ చేస్తున్న పనిని ఆయన అభినందించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అందించేందుకు ధృడ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్​ తెలిపారు. గ్రేటర్​ వరంగల్​ ప్రెస్​ క్లబ్​ ఆధ్వర్యంలో రెండు సొసైటీలలో లేని అర్హులైన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం హసన్​పర్తి మండలం మడిపల్లిలో కేటాయించిన 13 ఎకరాల స్థలానికి సంబంధించిన సర్క్యూలర్​ కాపీని సిక్స్​ మెన్ కమిటీ సభ్యులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, సిక్స్​ మెన్​ కమిటీ కన్వీనర్​ బీఆర్.లెనిన్​, కోకన్వీనర్ బొక్క దయాసాగర్​, సభ్యులు గడ్డం రాజిరెడ్డి, మస్కపురి సుధాకర్​ లు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు, ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​, ఎంఎల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​లను కొంతకాలంగా ఇళ్ల స్థలాలు అందించాల్సిందిగా సిక్స్​ మెన్​ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది. ఈ రోజు మంత్రి కేటీఆర్​ తో భూకేటాయింపు ఉత్తర్వులు తీసుకోవటం వల్ల ఎంతోకాలంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న చిరకాలకోరిక త్వరలో నెరవేరబోతోందని కమిటీ హర్షం వ్యక్తం చేసింది. త్వరలోనే సర్క్యులర్ ​పై వెంటనే జీవో విడుదల చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ను సిక్స్​ మెన్​ కమిటీ విజ్ఞప్తి చేసింది. వారి విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. సీసీఎస్ఏతో మాట్లాడతానని చెప్పారు. భూమి ఇప్పించేందుకు కృషిచేసిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, పెద్దమనసుతో తన నియోజకవర్గ పరిధిలోని స్థలం అందించిన వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వర్థన్నపేట ఎంఎల్ఏ ఆరూరి రమేష్ కు సిక్స్ మెన్ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కలెక్టర్ సిక్తాపట్నాయక్, అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, రెవెన్యూ అధికారులకు, ఇందుకోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. భూకేటాయింపునకు సంబంధించిన విషయంపై అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు స్థలాలు అందించే ఏర్పాట్లపై త్వరలోనే సిక్స్ మెన్ కమిటీ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తుందని సిక్స్ మెన్ కమిటీ కన్వీనర్ బీఆర్ లెనిన్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News