ఎన్నికలవేళ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన కేటీఆర్ గతంలో ఇంతకంటే అనేక సవాల్ తో కూడుకున్న ఎన్నికలలో విజయం సాధించిందని కేటీఆర్ తమ పార్టీ గురించి చెప్పుకున్నారు. గత ఎన్నికలు సాధించిన సీట్ల కన్నా ఎక్కువ సాధిస్తామని నమ్మకం ఉందన్న ఆయన, ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి పార్టీ తామే గెలుస్తామంటుంది కానీ ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి నాకు సోదరుడి లాంటివాడని, ఆంధ్రప్రదేశ్లోనూ నాకు అనేకమంది మిత్రులు ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఆయన మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉందని కేటీఆర్ అన్నారు. పోలింగ్ స్టేషన్లో దగ్గర కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు ముగ్గురు అధికారులతోని తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతుందని, ఆరు గ్యారంటీలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఒక గ్యారెంటీని సగం సగం అమలు చేసిందని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తాను ముఖ్యమంత్రిని గుర్తించాలన్నారు.
ఆయన ప్రభుత్వ పనితీరు పైన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్ననని, కరెంటు కోతలు నీటి కొరతల వంటి అసలైన సమస్యల పైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజా సమస్యల పైన ప్రభుత్వం పని చేసేలా చర్యలు తీసుకోవాలని, నరేంద్ర మోడీ శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్పినట్టు రాజా ధర్మాన్ని పాటించాలన్నారు. అన్ని రాష్ట్రాల మధ్యన ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించడం లేదా ప్రాజెక్టులు కేటాయించడం చేయలేదన్నారు.
భారతదేశం మొత్తం ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ప్రజలు ఎవరికి ఓటేస్తారో నాలుగో తేదీన తేలుతుందన్నారు. పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ప్రజలని మోసం చేస్తుంటే.. వందరోజుల నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని, ఈరోజు కరెంటు కోతల పైన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినట్టుగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు … ఇన్వర్టర్లు జనరేటర్లు, క్యాండిల్స్, పవర్ బ్యాంకులు, చార్జింగ్ లైట్, ఇవే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలన్నారు.
నంది నగర్ లోని జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న కేటీఆర్ కుటుంబం, ఐదేళ్లకోసారి ప్రభుత్వాలని ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలన్నారు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశమన్నారు కేటీఆర్. మన ప్రభుత్వాలని మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈరోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదన్నారు. దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
మంచి ప్రభుత్వాలను మంచి నాయకులను మీ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటు వేయండని, తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ తెచ్చిన పార్టీకి నాయకుడు కేసీఆర్, తెలంగాణ కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం నేను ఓటు వేశానన్నారు.