KTR| బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
- Advertisement -
“ఒక్క నిమిషానికి 40 సార్లు KCR గురించేనా.. చిట్టి నాయుడు. నిమిషానికి నలభైసార్లు KCR రావాలే అని తెగ ఒర్లుతావు! అసెంబ్లీలో KCR ముందు నుంచునే మాట దేవుడెరుగు… కనీసం మహబూబాబాద్ లో మహాధర్నాకు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేగా చిట్టినాయుడు?!” అని విమర్శించారు.
కాగా హన్మకొండ ప్రజా విజయోత్సవాలు, వేములవాడ బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి రుణమాఫీ, ఇతర అంశాలపై తనతో చర్చించాలని సవాల్ విసిరారు.