కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు చేశారు. ఆయన పేరును ఎన్నికల గాంధీ అంటూ మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో కులగణన సర్వేను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.
అసెంబ్లీలో కులగణన రిపోర్టు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు అబద్ధాలు. దారుణమైన అబద్ధాలు. నిన్నటి అసెంబ్లీ సమావేశం తెలంగాణ ప్రజలకు రెండు విషయాలను స్పష్టం చేసింది. ఒకటి స్పష్టత లేని విధ్వంసకర ప్రభుత్వం. రెండోది బీసీ డిక్లరేషన్ పేరుతో మీరు సిగ్గులేకుండా చేస్తున్న అబద్ధాలు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం పనిచేయాలనే ఉద్దేశ్యం మీకు ఎప్పుడూ లేదని స్పష్టమవుతోంది.
మీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా యూ-టర్న్ ప్రభుత్వం. కేంద్రంపైకి నెపం నెట్టి తప్పించుకోవాలని పన్నాగం వేసింది. ఇక మీ హామీలు, వాగ్దానాలు, ప్రకటనలు అన్నీ రాజకీయ ప్రకటనలే తప్ప మరేమీ కాదని మరోసారి రుజువైంది. రాహుల్ గాంధీ.. మీరు మీ పేరును ఎన్నికల గాంధీగా మార్చుకోవాలి. మీ BC డిక్లరేషన్ 100 శాతం అబద్ధం. నిబద్ధత 100 శాతం ఫెయిల్” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.