Friday, January 10, 2025
HomeతెలంగాణKTR: సీఎంగా రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టం: కేటీఆర్

KTR: సీఎంగా రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టం: కేటీఆర్

రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని సీఎంగా ఎన్నుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. రాష్ట్రంలో అనుముల కుటుంబ పాలన..అనుముల రాజ్యాంగం నడుస్తోందంటూ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి వికారాబాద్‌లో లభించిన స్వాగత వీడియోను పోస్టు చేశారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డికి వికారాబాద్‌లో మంత్రులను మించిన పోలీసు బందోబస్తు, కాన్వాయ్ అంటూ మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు.

- Advertisement -

“తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం.. ఒక్క CM ని ఎన్నుకుంటే ఇంకో అర డజన్ మంది ఫ్రీగా వచ్చారు. 1 + 6 ఆఫర్ సీఎం వ్యవస్థని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పడు చూడలేదెమో! వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి గారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సీఎం రేవంత్ రెడ్డి గారు నాది ఒక చిన్న విన్నపం. ప్రజా పాలన కాబట్టి ప్రజలకి మీ అనుముల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. IVRS పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండి” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News