Saturday, September 28, 2024
HomeతెలంగాణKTR tweet on CM Revanth: ముఖ్యమంత్రి గారు, CM అంటే "కటింగ్ మాస్టరా”?

KTR tweet on CM Revanth: ముఖ్యమంత్రి గారు, CM అంటే “కటింగ్ మాస్టరా”?

CM అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా ?

ప్రతి పథకంలో లబ్దిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా ?
CM అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా ?

- Advertisement -

నాడు.. పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు
నేడు… 2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు

మొదలు ₹39 వేల కోట్లు అని ఇప్పుడు ₹31 వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారు

పాసుబుక్కులు లేవనే నెపంతో…
లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించం..

రేషన్ కార్డు సాకు చూపి… లక్షల మందికి మొండిచెయ్యిచ్చే కుతంత్రం చేస్తే భరించం..

ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి..
చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి..
శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోం..

మొన్న..
లక్షలాది మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారు

నిన్న..
200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారు.

నేడు…
2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి…
లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదు..

నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదు..
ఓట్ల పండగ ముగిసినా.. ఎకరానికి రూ.7500ల రైతుభరోసాకు అడ్రస్సే లేదు..

కాంగ్రెస్ ప్రచారంలో “అందరికీ అన్నీ” అన్నారు..
అధికారంలోకి రాగానే “కొందరికే కొన్ని” అని కోతపెడుతున్నారు

రుణమాఫీపై
మాట తప్పినా… మడమ తిప్పినా…
లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తాం, పోరాడుతాం

జై కిసాన్
జై తెలంగాణ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News