Friday, November 22, 2024
HomeతెలంగాణKTR: అంబేద్కర్ విగ్రహం కాదది విప్లవం

KTR: అంబేద్కర్ విగ్రహం కాదది విప్లవం

అంబేద్కర్ కు నివాళి అర్పించిన కేటీఆర్

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్పూర్తితోనే లక్షలాది మందిని సమీకరిస్తూ 14 ఏళ్లపాటు తెలంగాణ పోరాటాన్ని కెసిఆర్ నాయకత్వంలో కొనసాగించామన్నారు. ప్రజా పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో, అంబేద్కర్ ఆశయాల ఆలోచనల మేరకు పది సంవత్సరాలు మా ప్రభుత్వం పనిచేసిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే ప్రగతి వస్తుంది, ప్రగతి తోనే సమానత్వం వస్తుంది అన్న ఆయన ఆలోచనతో 1022 గురుకులాలు పెట్టుకున్నామన్నారు.

- Advertisement -

వీటినుంచి బయటకు వచ్చిన లక్షల పదిమంది భవిష్యత్తు తెలంగాణ పౌరులు ఈరోజు అనేక ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్నారని, వీరందరూ జీవితంలో పైకి వచ్చినప్పుడు సమాజంలో అసమానతలు తొలగుతాయన్నారు కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, మేము ఏర్పాటు చేసింది విగ్రహం కాదు విప్లవం అనే మాటను కేసీఆర్ చెప్పారన్నారు. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం అది కేసిఆర్ కే సాధ్యమైందన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ అందరి మనిషి… ఆరోజు మహాత్మ గాంధీతో పోల్చి చూడదగిన గొప్ప నాయకుడని కేటీఆర్ అన్నారు.

బడుగు బలహీన వర్గాల కోసం దళిత గిరిజన వర్గాల కోసం ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా… అవన్నీ కూడా అంబేద్కర్ ఆలోచన నుంచి వచ్చినవేనని, కొలంబియా యూనివర్సిటీలో ఆయనకు ఇచ్చిన ఘనమైన నివాళి మనమందరం గుర్తు తెచ్చుకోవాలి. అంబేద్కర్ ఆధునిక భారతదేశ జాతిపిత అనేటువంటి మాట చెప్పిందన్నారు. సమాజంలో సమానత్వం రావాలి అంటే రాజ్యాంగ స్ఫూర్త కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని, రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు అంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలంతా కలిసి అంబేద్కర్ ఆలోచనల కోసం ఆయన ఆశల కోసం కలిసి పని చేయాల్సిన అవసరం ఉన్నదని, ఆ దిశగా అందరం కలిసి ముందుకు సాగుదామని విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News