Friday, April 4, 2025
HomeతెలంగాణKTR tweet: పిచ్చోడి చేతిలో పార్టీ, ప్రజాస్వామ్యానికే ప్రమాదం

KTR tweet: పిచ్చోడి చేతిలో పార్టీ, ప్రజాస్వామ్యానికే ప్రమాదం

ప్రశ్నపత్రాల లీక్‌ పై కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేయటం విశేషం. స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నేతలు చెలగాటమాడుతున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం.. అదే పిచ్చోడి చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి విద్యార్థుల జీవితాలో చెలగాటమాడుతున్నారు’’ అని కేటీఆర్‌ మండిపడ్డారు.

- Advertisement -

తెలంగాణలో వరుసగా రెండు రోజులు టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రాలు వాట్సప్‌లో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. దీనిపై బీఆర్భాఎస్, బీజేపీ మధ్య రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News