Friday, September 20, 2024
HomeతెలంగాణKTR: దివ్యాంగులకు అన్ని విధాల సపోర్ట్ చేస్తాం

KTR: దివ్యాంగులకు అన్ని విధాల సపోర్ట్ చేస్తాం

వ్యాంగులను అక్కున చేర్చుకోవాలని ఎవరూ అడగక ముందే పెన్షన్ పెంపు

దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి కేటీ రామారావు అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వికలాంగులకు (1220 మందికి) సహాయాలు, ఉపకరణాల పంపిణీ మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీలో భాగంగా 426 మందికి చెవి మెషీన్లు,168 మందికి క్రచెస్,130 మందికి చేతితో నడిపే త్రిచక్ర వాహనాలు, 75 మందికి వీల్ చైర్లు,160 మందికి మోటార్ సైకిళ్ళు, 136 మంది కంటి చూపు లేని వారికి స్మార్ట్ ఫోన్, వాకింగ్ స్టిక్స్, 40 టెలివిజన్లు,103 ఇతర ఉపకరణాలు 1 వేయి 220 మంది దివ్యాంగుల కోసం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో ఇవ్వని విదంగా దివ్యాంగులకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో సంక్షేమ శాఖ తరపున చేపడుతున్న కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని, సమైక్య రాష్ట్రంలో 500 వందలు వచ్చేదని, ప్రస్తుతం 4 వేల 116 రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

- Advertisement -

ప్రభుత్వం తరపున నిర్మించే ప్రతీ భవన నిర్మాణం దివ్యాంగులకు అనుకూలంగా ర్యాంపులు ఉండాలని మున్సిపల్ శాఖ మంత్రిగా భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసే ముందు ఈ నియమాలు పాటించే విధంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకునేలా నియమావళిలో పొందుపరచారని అన్నారు. రాష్ట్ర దివ్యాంగుల కార్పోరేషన్ చైర్మెన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దివ్యాంగులకు అందించే పెన్షన్ కు మరో వెయ్యి రూపాయలకు పెంచుతూ తీపి కబురు అందించారని అన్నారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి దివ్యాంగుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులను అక్కున చేర్చుకోవాలని ఎవరూ అడగక ముందే దివ్యాంగుల సంక్షేమం గురించి అలోచించి పెన్షన్ పెంపుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ 1220 మంది దివ్యాంగులకు వారికి కావాల్సిన పరికరాలను అలింకో సంస్థ వారి సహకారంతో అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పెన్షన్, ఉపకార వేతనాలతో పాటు వివిధ పథకాలను అందజేస్తుందని, దివ్యాంగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

అనంతరం జిల్లాలోని 50 మంది దివ్యాంగులకు 25 లక్షల ఆర్థిక సహాయం అందించే చెక్కును అందజేశారు.కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మెన్ రసమయి బాలకిషన్,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టైస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు,రాష్ట్ర పవర్ లూమ్, టెక్స్ టైల్స్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, దివ్యాంగులు,వయో వృద్ధులు, సంక్షేమ శాఖ కమీషనర్ శైలజ, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, సెస్ చైర్మెన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఆర్డీఓటి శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ గౌతం రెడ్డి, సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News