Friday, April 11, 2025
HomeతెలంగాణKukatpally: కార్పొరేటర్లతో కృష్ణారావు భేటీ

Kukatpally: కార్పొరేటర్లతో కృష్ణారావు భేటీ

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి క్యాంప్ కార్యాలయంలో… నియోజకవర్గ కార్పొరేటర్లు అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ..ఇందులో ప్రధానంగా నియోజకవర్గంలోని కార్పొరేటర్లు పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు లిఖితపూర్వకంగా పెండింగ్ పనులు, కరెంట్ పోల్స్ కు సంబంధించి అధికారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో లేఖలు అందించారు.. ప్రధానంగా పారిశుద్ధ్య వ్యవస్థపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ వ్యవస్థను మరియు రోడ్లను శుభ్రపరచాలని ఏదైనా వాహనాలు ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు హామీ ఇచ్చారు… అంతేకానీ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండాలని గట్టి సూచనలు చేశారు.. అలాగే విద్యుత్ పోల్స్ సంబంధించి ప్రధానంగా ఉన్న సమస్యను నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయాలని ఇకముందు ఫిర్యాదులు రాకుండా చూడాలని గట్టి ఆదేశాలు జారీచేశారు.. పెండింగ్లో ఉన్న రోడ్లు కూడా త్వరగా పూర్తి చేయాలని మరియు డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి హాస్టల్స్ మరియు హోటల్లు వ్యర్ధాలను నేరుగా అందులోకి వదలకుండా వారికి తెలియపరచాలని లేనియెడల గట్టి చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు… ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News