కూకట్పల్లిలోని శ్రీ ఉదాసీన్ మఠానికి చెందిన సుమారు 540 ఎకరాల భూమిని దైవిక, సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించేందుకుగాను మఠం నిర్వాహకులు భూమి పూజ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు 60 మంది వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. సాధు సంతువుల నివాసం.. వేద పాఠశాల, యాగశాల, గోశాల నిర్మాణానికి మొదటి దశలో పనులు చేపట్టనున్నారు. 6000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ పంచాయతీ అఖాడ ఉదాసీన్ మఠం చైర్మన్ శ్రీ రఘు మునిజి ఆధ్వర్యంలో మఠం ప్రతినిధి రామకృష్ణ దంపతులు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు మొదటి రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి.. వందలాది ఎకరాల్లో చుట్టూ పచ్చని మొక్కలు.. అరటి, జామ ,కొబ్బరి తోటల నడుమ ఏర్పాటు చేసిన యాగశాల.. పూజా మందిరాలు.. ప్రకృతి ప్రేమికుల తో పాటు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి.. మఠం భూముల్లో కొలువుదీరిన వందలాది నెమలు అటు ఇటు సంచరిస్తూ పట్టణంలో అటవీ వాతావరణ తలపిస్తుండగా.. రామాయణంలోని పర్ణశాలను తలపించేలా చేపట్టిన ఏర్పాట్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి.. భూమి పూజ కార్యక్రమానికి ప్రజలందరూ ఆహ్వానితులేనని మఠం నిర్వాహకులు తెలిపారు.. ఆ మేరకు హాజరయ్యే ప్రజలందరి కోసం చక్కటి ఏర్పాట్లు చేశారు..
మొదటిరోజు పూజా కార్యక్రమాలు..
బుధవారం మొదటి రోజు గణపతి పూజతో సంకల్పం.. దీక్ష ధారణం.. యాగశాల ప్రవేశం.. రుత్విక్ వే.. వేద పండితులచే చతుర్వేద పారాయణం హోమం .. హవనం.. గణపతి హోమం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు..
రెండవ రోజు పూజా కార్యక్రమాలు
గురువారం రెండవ రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామి వార్ల ప్రత్యేక అలంకరణ, ఆరాధనతో పాటు నవగ్రహ వాస్తు పూజలు.. వేద హవనము.. చతుర్వేద పారాయణం హోమం.. తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు
3వ రోజు పూజా కార్యక్రమాలు
శుక్రవారం చివరి రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా సుదర్శన హోమం ..పూర్ణాహుతి.. భూమి పూజ వేద పండితుల మహాస్వామిజీల ఆశీర్వచనం మార్గదర్శన (ప్రవచనం) కార్యక్రమాలు అనంతరం తీర్థప్రసాద.. అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని ఉదాసీన్ మఠం నిర్వాహకులు తెలిపారు..
తరలి రానున్న ప్రముఖులు
దేశంలోనే పేరొందిన మఠం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలలోని సాధువులు.. స్వామీజీలు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు రానున్నారు.. పూర్తిగా దైవిక, సామాజిక సేవా కార్యక్రమాలకే పరిమితమైన ఉదాసీన్ మఠం కూకట్పల్లి ప్రాంతంలో నగరంలోనే అతిపెద్ద దైవిక సేవ కేంద్రంగా విలసిల్లనుంది..
ఘనంగా ఏర్పాట్లు..
మూడు రోజుల పూజా కార్యక్రమాలను పురస్కరించుకొని ఏర్పాట్లు ఘనంగా చేపట్టారు.. వర్షం వచ్చినా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అతిపెద్ద యాగశాలను టార్పాలిన్ కవర్లతో కప్పి.. నీటి చుక్క లోనికి రాకుండా చేశారు.. వేద పండితులకు స్వామీజీలకు సుమారు 2000 మందికి సరిపడా వేరువేరుగా భోజనశాలలు నిర్మిస్తున్నారు.. చివరి రోజున భూమి పూజ కార్యక్రమానికి ఆహుతులతో పాటు సామాన్య ప్రజానీకం కూడా పాల్గొనే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బారికేట్లను ఏర్పాటు చేస్తున్నారు.. చివరి రోజున హాజరయ్యే ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదం అన్నసంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు
త్వరలోనే పూర్తిస్థాయి సేవలు
నగరంలోని కేబీఆర్ పార్కును మించిపోయేలా వాకింగ్ మరియు సైక్లింగ్ ట్రాక్ల నిర్మాణం యోగ మెడిటేషన్ కేంద్రాలు ప్రతిరోజు 10,000 మందికి అన్నప్రసాద వితరణ సత్రాలు.. మరియు యాగశాలలు.. ఉచిత వైద్య కేంద్రాల నిర్మాణం వంటివి చేపట్టడం ద్వారా ప్రతిష్టాత్మకమైన ఉదాసీన్ మఠం సేవలను మరింత విస్తృతం చేయాలని మఠాధిపతి శ్రీ రఘు మునిజీ భావిస్తున్నారు.. అనాధ పిల్లల కోసం ఆశ్రమం కూడా నిర్మించనున్నారు.. పూర్తి స్థాయిలో దైవిక సామాజిక సేవా కార్యక్రమాలు అందుబాటులోకి వస్తే రాబోయే రోజుల్లో కూకట్పల్లిలోని ఉదా సీన్ మఠం మరో చారిత్రాత్మక పర్యాటక కేంద్రంగా మారడం ఖాయం..