Saturday, April 12, 2025
HomeతెలంగాణKukatpally: టెన్నిస్ గ్రౌండ్ ప్రారంభించిన మాధవరం

Kukatpally: టెన్నిస్ గ్రౌండ్ ప్రారంభించిన మాధవరం

కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కె.పి.హెచ్.బి కాలనీ 15వ ఫేస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన “టెన్నిస్ గ్రౌండ్” ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ పగడాల శిరీష బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ… ప్రతి డివిజన్లోని క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడా మైదానాలను ..ఓపెన్ జిమ్లను పార్కులను అభివృద్ధి చేస్తున్నామని ..ప్రజలు ఇవన్నీ ఉపయోగించుకోవాలని, జరుగుతున్న అభివృద్ధికి తిరిగి మళ్లీ పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఇందుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు… ఈ కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి అధికారులు డిఈ ఆనంద్, ఏఈ శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు శ్రీ సిహెచ్ ప్రభాకర్ గౌడ్ , కార్యదర్శి శ్రీ వెంకటేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News