Friday, April 11, 2025
HomeతెలంగాణKukatpally: బిఆర్ఎస్ లోకి యువరక్తం

Kukatpally: బిఆర్ఎస్ లోకి యువరక్తం

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కూకట్పల్లి శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో చైతన్య యాదవ్, సంతోష్, మహేష్ ఆధ్వర్యంలో జరిగిన యూత్ ఇంట్రాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ఈనాటి యువతే రేపటి భవిష్యత్తు అని, రాజకీయాలు కూడా యువతపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అన్నారు. నేడు రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలే వారి భవిష్యత్తుకి మార్గదర్శకాలు కూడా అవుతాయని అనడంలో సందేహం లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇందుకు నిదర్శనమే మంత్రి కేటీఆర్ ఎన్నోవేల పరిశ్రమలను నేడు ముందుచూపుతో హైదరాబాద్ మహానగరానికి తీసుకువచ్చి భవిష్యత్తులో యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా చర్యలు తీసుకోవడం గొప్ప పరిణామం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం వంటి నీటి ప్రాజెక్టులు నిర్మించి ఒకప్పుడు బీడు భూములుగా ఉండే నేలలను పంట భూములుగా మార్చిన ఘనత ఆయనకే చెల్లుతుందని, భవిష్యత్తులో ఆహార కొరత లేకుండా చర్యలు తీసుకునే విధంగా ఇలాంటి ముందుచూపు ఉన్న నాయకులు మనకు దొరకడం అదృష్టం అన్నారు. ఈ సందర్భంగా ఫణి ముదిరాజ్, శ్రీధర్, విశ్వనాథరెడ్డి, లడ్డు, 130 మంది యువకులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News