Wednesday, October 30, 2024
HomeతెలంగాణKuna Srisailam Goud: సూరారం డివిజన్ లో కూన శ్రీశైలం ప్రచారం

Kuna Srisailam Goud: సూరారం డివిజన్ లో కూన శ్రీశైలం ప్రచారం

స్థానికులకు అభివృద్ధి ఏంటో చూపుతానంటున్న కూన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ లో కళావతి నగర్, ఏపీఏసీ కాలనీ, రాజీవ్ గాంధీ నగర్, శివాలయ నగర్, మస్తాన్ బిల్డర్స్, లక్ష్మీ నగర్, సూరారం విలేజ్, విశ్వకర్మ కాలనీల్లో కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ స్థానిక బిజెపి నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలకగా, పెద్ద ఎత్తున ప్రజలు హాజరై శ్రీశైలం గౌడ్ కి తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు.

- Advertisement -

కాలనీలో నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి హామీలు ఇస్తూ, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.సర్వేలన్నీ బిజెపి గెలుస్తాయని చెబుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండో స్థానం కోసం కొట్లాడుతున్నాయి. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనతో ప్రజలు విసిగిపోయారు.


ఎన్నికలు వచ్చినపుడే కాంగ్రెస్ అభ్యర్థి హనుమంత్ రెడ్డికి ప్రజలు గుర్తుకొస్తారని, గత తొమ్మిది సంవత్సరాలలో ఎన్నడూ ఆయన ప్రజలకు అందుబాటులో లేడని, ప్రజా సమస్యల పట్ల ఎన్నడూ కొట్లాడాలేదని అన్నారు.బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానందకు కేసీఆర్ తో కొట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొచ్చే దమ్ము లేదని, సిద్దిపేట గజ్వేల్, సిరిసిల్ల లాగా కుత్బుల్లాపూర్ ఎందుకు అభివృద్ధి కాలేదని ప్రశ్నించారు? రాష్ట్రంలో కే.సి.ఆర్ ఏక్ నెంబర్ దొంగ అయితే, కేపీ వివేక్ దస్ నంబర్ దొంగ అని అన్నారు.కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు దుర్యోధనరావు సీనియర్ నాయకులు బక్క శంకర్ రెడ్డి, చౌడ శ్రీనివాస్, నాగేల్ల శ్రీనివాస్, బావిగడ్డ రవి, పత్తి రఘుపతి, చండి శ్రీనివాస్, సుశాంత్ గౌడ్, వారాల మహేష్, రాజేష్ మిశ్రా, సంగీతా పాత్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News