Saturday, April 19, 2025
HomeతెలంగాణKuna Srisailam Goud: గెలిచినా ఓడినా ఇక్కడుండేది నేనొక్కడినే

Kuna Srisailam Goud: గెలిచినా ఓడినా ఇక్కడుండేది నేనొక్కడినే

ఓటర్లను ఆకట్టుకునేలా మాటలు

సుభాష్ చంద్రబోస్ నగర్, శ్రీరామ్ నగర్ (బి) కాలనీలలో బీజేపీ ఎన్నికల ప్రచారం..
ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్..బీఆర్ఎస్ మోసాలను, బీజేపీ హామీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ లో కమల వికాసం కనిపిస్తుందని తన నామినేషన్ కు వచ్చిన జనాలను చూసి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల గుండెల్లో దడ పుట్టిందన్నారు కూన. బీఆర్ఎస్ పార్టీ స్కీముల పేరిట అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాలను అక్కున చేర్చుకుందన్నారు. బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది, ఎస్సీ వర్గీకరణకు కృషి చేసింది బీజేపీయేనని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు.

- Advertisement -


బీఆర్ఎస్ లా దళిత బందు పేరిట దళితులను, బీసీ బందు పేరిట బీసీ లను, గిరిజన బందు పేరిట ఎస్టీలను మోసం చేయలేదన్నారు ఆయన. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోతే అమెరికా పోతాడు, కాంగ్రెస్ అభ్యర్థి వ్యవసాయం చేస్కుంటా అంటున్నాడు, నేను మాత్రం ఎప్పుడు షాపూర్ నగర్ లోనే ఉంటానన్నారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకున్ని ఆశీర్వదించండి. గేటెడ్ కమ్యూనిటీల్లో, జూబ్లీహిల్స్ లో ఉండే వాళ్ళను తరిమికొట్టండన్నారు. బీజేపీకి ఓటేసి, అభివృద్ధికి పట్టం కట్టండి, బీఆర్ఎస్, కాంగ్రెస్ లను బొందపెట్టి, బీజేపీతో జట్టు కట్టండి అని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News