Saturday, November 15, 2025
HomeతెలంగాణKuna Srisailam Goud: గులాబీకి రెండు ఛాన్సులు, ఈ ఛాన్స్ నాకే

Kuna Srisailam Goud: గులాబీకి రెండు ఛాన్సులు, ఈ ఛాన్స్ నాకే

పద్మశాలీల ఏకగ్రీవ మద్దతు కూన శ్రీశైలంకే

బీఆర్ఎస్ కు రెండు ఛాన్సులిచ్చారు.. నాకు ఓ ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతున్నారు సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్. జీడిమెట్ల 132 డివిజన్ , శ్రీనివాస్ నగర్ కాలనిలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కాలనీ వాసులతో సమావేశమై, ప్రచారం చేపట్టారు. భారతీయ జనతా పార్టీ కి మద్దతు ఇచ్చి, తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, సర్వేలన్నీ కుత్బుల్లాపూర్ లో బిజెపి గెలుస్తుందని చెప్తున్నాయని ఎన్నికలు అయ్యాక టిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు అందుబాటులో ఉండరని అన్నారు. అధికారం ఉన్నా, లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకున్ని నేనేనని, ఎన్నికల్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పి బిజెపిని గెలిపించాలని కోరారు.

- Advertisement -

కూన శ్రీశైలంకి పద్మశాలిల మద్దతు
శ్రీశైలం గౌడ్ కి వివిధ వర్గాల ప్రజలు, కుల సంఘాలు యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ మద్దతును తెలియజేస్తున్నారు. గాజులరామారం డివిజన్ శ్రీరామ్ నగర్ కు చెందిన పద్మశాలి సేవా సంఘం నాయకులు శ్రీశైలం గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి, ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా తమ మద్దతును తెలియజేశారు. కుత్బుల్లాపూర్ అభివృద్ధి కూన శ్రీశైలం గౌడ్ తోనే సాధ్యమని భావిస్తూ, తమ మద్దతు తెలియజేశామని తెలిపారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ లో అన్ని వర్గాల ప్రజలు తనకు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారని, తాను ఎమ్మెల్యేగా గెలిచాక బీసీ కులాలకు అండగా నిలబడి, సంక్షేమ భవనాలతో పాటు వారి అభివృద్ధికి తోడ్పడుతానని అన్నారు. బీసీలకు అండగా నిలబడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని, బిసి ముఖ్యమంత్రిని ప్రకటించిన ఘనత భారతీయ జనతా పార్టీ దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం నాయకులు బి శ్రీనివాస్, నారా వెంకటేశం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad