తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తుగ్లక్‌కు లేటెస్ట్ వర్షన్ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘తుగ్లక్’ గురించి మనం పుస్తకాలలో మాత్రమే చదివామని లేటెస్ట్ వెర్షన్ చూడాలంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే చాలు. ఆయన విధ్వంసం, పరధ్యానం, పాథలాజికల్ అబద్ధాలు చెప్పడంలో నిపుణుడు’ అని కేటీఆర్ వ్యంగ్యంగా రాసుకొచ్చారు.
కాగా శనివారం వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ వన్ కార్ రేస్‌కు సంబంధించి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో 20 రోజుల వరకు ఆయనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కేటీఆర్‌కు స్వల్ప ఊరట లభించింది.