తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలలో అల్లాపూర్ డివిజన్ రుపురేఖలు మార్చామని బిజెపి , కాంగ్రెస్ పాలించినా అల్లాపుర్ డివిజన్ వైపు కన్నెత్తి చూడలేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సబిహా గౌసుద్దిన్ తో కలిసి 25వ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేశారు. డివిజన్లోని అల్లాపూర్, రాజీవ్ గాంధీ నగర్, సబ్దర్ నగర్ లో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులతో కలిసి సమస్యలను పరిష్కారం చేస్తున్నారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ అల్లపూర్ డివిజన్ ను 60 సంవత్సరాలు పాలించిన బిజెపి కాంగ్రెస్ పార్టీలు డివిజన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదని తొమ్మిది సంవత్సరాలలో ప్రతి బస్తీకి రోడ్లు ,డ్రైనేజీలో ఇంటింటికి మంచినీటి సమస్య ఇప్పించడంతో పాటుగా కేసీఆర్ ప్రవేశపెట్టిన 59 జీవో ప్రకారం రెగ్యులరైజేషన్ చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి విడుతలవారీగా ఇండ్లు అందిస్తామని అందులో భాగంగానే సెప్టెంబర్ రెండవ తారీఖున 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూంలు పంపిణీ చేస్తున్నామని మొత్తం 8 విడుతలలో 4400 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూంలు అందజేస్తామని ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండు పడకల ఇళ్ల పంపిణీ కార్యక్రమం దుండిగల్ లోని అత్యంత వైభవంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు ..వివేక్ గౌడ్.. హాజరయ్యారు.
ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎంపికైన 500 మంది లబ్ధిదారులకు నివాస ధృవ పత్రాలు అందించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ 60 ఏళ్లుగా ఏ పార్టీ చేయనటువంటి.. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపారని అన్నారు.. అలాగే బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ విధంగా రెండు పడకల గదులు ఇల్లు ఇచ్చారని ప్రశ్నించారు.. నిరుపేద ఆడబిడ్డ పెళ్లయితే కళ్యాణ లక్ష్మి .. షాది ముబా రక్..ఆ బిడ్డ గర్భవతి అయి ఆసుపత్రిలో చేరితే కేసిఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలతో నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు..